శ్రీశైలం డ్యామ్‌ గేట్లు మూత...

శ్రీశైలం డ్యామ్‌ గేట్లు మూత...

ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది... దీంతో ఇప్పటి వరకు డ్యామ్ గేట్లను ఎత్తివేసి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేసిన అధికారులు... ఇప్పుడు అన్ని గేట్లను మూసివేశారు. శ్రీశైలం డ్యామ్‌కు ప్రస్తుతం 1,48,762 క్యూసెక్కుల ఇన్‌ప్లో ఉండగా... అవుట్ ప్లో 1,05,910 క్యూసెక్కులుగా ఉంది... శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 882.40 అడుగులుగా ఉంది. ఇక శ్రీశైలంలో పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 201.12 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం డ్యామ్ కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు అధికారులు.