బ్యాటరీ చేంజ్ చేసేప్పుడే ప్రమాదం.. అంచనాకు వచ్చిన సీఐడీ !

బ్యాటరీ చేంజ్ చేసేప్పుడే ప్రమాదం.. అంచనాకు వచ్చిన సీఐడీ !

శ్రీ శైలం పవర్ హౌస్ ప్రమాదం మీద సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. పోలీస్ లు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు ఉన్నట్టు చెబుతున్నారు. ప్రమాదం మీద పోలీసులకు ఇంఛార్జి  ఉమ మహేశ్వర చారీ ఫిర్యాదు చేశారు. 20వ తేదీ రాత్రి 10 గంటల 20 నిమిషాలకు ప్రాజెక్ట్ లో ప్రమాదం జరిగింది.  హైడ్రో పవర్ టన్నెల్ లో పని జరుగుతున్న టైమ్ లో సడన్ గా మెషిన్ లో ప్రమాదం సంభవించింది. ఏఈ, డిఈ, ఏఏఈలతో పాటు మొత్తం 9 మంది సిబ్బంది మృతి చెందారు.

చనిపోయిన వారిలో ప్రాజెక్ట్ లో  బ్యాటరీలు అమర్చడానికి వచ్చిన అమర్ రాజ కంపెనీ కి చెందిన ఇద్దరు మెకానిక్ లు కూడా ఉన్నారు. టర్బన్ వేగం పెరగడం వల్ల ప్యానెల్ యూనిట్స్ లో షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెబుతున్నారు. ప్రమాదంలో పవర్ హౌస్ జెనరేటర్ లు,కేబుల్ , ప్యానెల్స్ దెబ్బ తిన్నాయి. బ్యాటరీ చేంజ్ చేసేటపుడు న్యూకిలస్ న్యూట్రల్ గా మారకపోవడం వల్ల ప్రమాదం అని సీఐడీ ప్రాధమిక అంచనాకి వచ్చింది.