బ్రేకింగ్ : శ్రీశైలం ఘాట్ లోయలో పడిన క్వాలిస్..

బ్రేకింగ్ : శ్రీశైలం ఘాట్ లోయలో పడిన క్వాలిస్..

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట సమీపంలో అదుపుతప్పి లోయలో క్వాలిస్ వాహనం పడింది. 12 మంది ప్రయాణికులలో 4గురు మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. అమ్రాబాద్‌ మండలం ఈగలపెంట వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. 50 అడుగుల లోతులో క్వాలిస్ పడినట్టు చెబుతున్నారు. ప్రమాద సమయంలో వ్యానులో 12 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా చెబుతున్నారు. హైదరాబాద్ మంగళ హాట్ కు చెందినా పన్నెండు మంది హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను పోలీసులు, విద్యుత్ సిబ్బంది వెలికితీస్తున్నారు.