ఈ నెల 27న శ్రీశైల ఆలయం మూసివేత

ఈ నెల 27న శ్రీశైల ఆలయం మూసివేత

చంద్ర గ్రహణం కారణంగా ఈనెల 27న శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీరామచంద్రమూర్తి సోమవారం ప్రకటించారు. జులై 27న మధ్యాహ్నం 2గంటల నుంచి 28 తెల్లవారుజామున 4.30గంటల వరకు ఆలయం మూసివేస్తామని తెలిపారు. చంద్ర గ్రహణం  ముగిశాక 28వ తేదీ తెల్లవారుజామున 4.30గంటలకు ఆలయ ద్వారాలు తెరచి.. ఆలయశుద్ధి తర్వాత భక్తులకు స్వామివారి దర్శనానికి వీలు కల్పిస్తారని తెలిపారు.