'నేను ఎమ్మెల్సీ పదవిని వదులుకొని వచ్చా..!'

'నేను ఎమ్మెల్సీ పదవిని వదులుకొని వచ్చా..!'

ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష సమావేశం జరగనుంది... ఈ సమావేశంలోనే కేబినెట్ మంత్రులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇవ్వనున్నారు. దీంతో మంత్రి పదవి ఆశిస్తున్నవారిలో టెన్షన్ మొదలైంది. అయితే, ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలో సీఎం వైఎస్ జగన్‌కు బాగా తెలుసు అంటున్నారు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన... నేను గతంలో అధికార పార్టీ నుంచి వైసీపీకి వచ్చాను.. ఎమ్మెల్సీ పదవికి, శాసన మండలి చైర్మన్ పదవిని వదులుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని గుర్తుచేశారు. ఇక వైఎస్ జగన్ అద్భుతమైన ముఖ్యమంత్రి అంటూ ప్రశంసలు కురిపించారు శిల్పా చక్రపాణిరెడ్డి. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే.