శ్రీశైలం ప్ర‌మాదం: స‌ర్కార్ ఎక్స్‌గ్రేషియాపై అస‌హ‌నం..! ఆస్ప‌త్రి ఎదుట బైఠాయింపు.

శ్రీశైలం ప్ర‌మాదం: స‌ర్కార్ ఎక్స్‌గ్రేషియాపై అస‌హ‌నం..! ఆస్ప‌త్రి ఎదుట బైఠాయింపు.

శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో తొమ్మిది మంది మృతి చెందారు.. డీఈ శ్రీనివాస్ గౌడ్, ఏఈలు వెంకట్ రావు, మోహన్ కుమార్, ఉజ్మ ఫాతిమా, సుందర్, ప్లాంట్ అటెండెంట్ రాంబాబు, జూనియర్ అటెండెంట్ కిరణ్, హైదరాబాద్ అమరన్ బ్యాటరీ కంపెనీకి చెందిన వినేష్ కుమార్, మహేష్ కుమార్ మృతిచెంద‌గా... వీరికి ప్ర‌భుత్వం ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించింది. వీరిలో డీఈ శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి రూ. 50 ల‌క్ష‌లు ప్ర‌క‌టించిన స‌ర్కార్.. మిగ‌తా మృతుల కుటుంబాల‌కు రూ. 25 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్ర‌క‌టించింది.. ఇక‌, ఒక్కో ఫ్యామిలీలో ఒక‌రికి ప్ర‌భుత్వ ఉద్యోగం క‌ల్పిస్తామ‌ని వెల్ల‌డించారు. అయితే, జెన్ కో హాస్పిటల్ లో మృతుల కుటుంబాల ఆందోళ‌న‌కు దిగాయి.. మార్చురీ ఎదురుగా బైఠాయించిన మృతుల కుటుంబ స‌భ్యులు.. ఏఈ స్థాయి అధికారి కుటుంబాల‌కు కూడా రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియాపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. కోటి రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.. హామీ ఇచ్చేవరకు బాడీలు తీసుకెళ్లేది లేదంటూ ఆందోళ‌న‌కు దిగారు.