శ్రీశైలం నుంచి 4 గేట్ల ద్వారా దిగువకు నీరు...

శ్రీశైలం నుంచి 4 గేట్ల ద్వారా దిగువకు నీరు...

వర్షాలు తగ్గడం, కృష్ణానదిలో వరద ప్రవాహం తగ్గడంతో శ్రీశైలం జలాశయానికి వరదనీరు క్రమంగా తగ్గుతోంది... ఇన్ ఫ్లో 1,72,260 క్యూసెక్కులు ఉండగా... శ్రీశైలం డ్యామ్ 4 గేట్లును 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో 1,72,260 క్యూసెక్కులుగా ఉండగా... నాలుగు గేట్ల ద్వారా 2,10,315 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం నీటిమట్టం 883.10 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిలువ సామర్ధ్యం 215 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 205.2258 టీఎంసీలుగా ఉంది. మరోవైపు శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.