శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వేదపండితులు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిపారు. దీనిలో భాగంగా సాయంత్రం 7 నుంచి 8 మధ్య తిరువీధుల్లో సేనాపతి ఉత్సవం నిర్వహించారు. రేపు సాయంత్రం 4 గంటల నుంచి 4.45 గంటల మధ్య మకరలగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు రాత్రి పెద్ద శేష వాహనసేవతో శ్రీవారి వాహనసేవలు ప్రారంభవుమతాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. గరుడ సేవ నాడు గ్యాలరీలో ఉన్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అన్నప్రసాదం, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లను అందించే విధంగా చర్యలు తీసుకున్నట్లు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు.