అందుకే 'ఈగ' మూవీ

అందుకే 'ఈగ' మూవీ

తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనాలు సృష్టించిన కొద్ది మంది దర్శకుల్లో ఎస్.ఎస్ రాజమౌళి ఒకరు .''బాహుబలి'' వంటి చిత్రాలతో యావత్ ప్రపంచాన్నే ఆకట్టుకున్నారు. 'మర్యాద రామన్న' తర్వాత రాజమౌళి ప్రభాస్ తో సినిమా చేయాలనుకున్నారు. కానీ, ప్రభాస్ కి రాజమౌళికి మధ్యలో ఈగ వచ్చి చేరడంతో కాస్త ఆలస్యం అయ్యింది. ఒక సందర్భం ఈగ ఎలా పుట్టింది అని జక్కన్నని అడిగేతే ఇలా చెప్పుకొచ్చారు... 'మర్యాదరామన్న' లాంటి సినిమా తర్వాత ప్రభాస్ తో సినిమా చేద్దాం అనుకున్న జక్కన్నకి మధ్యలో కొన్ని నెలలు సమయం రావడంతో ఆ సమయంలో ఏదో ఒక చిన్న సినిమా చేద్దాం అనుకున్నారు. 

గతంలో వాళ్ల నాన్న దగ్గర పనిచేస్తున్న సమయంలో జక్కన్నకు వాళ్ల నాన్న ఈగ గురించి చెప్పారట.. అప్పుడే వాళ్లు ఈగ చేద్దాంమని అనుకోలేదన్నారు జక్కన్న.. అయితే, సింహాద్రి, ఛత్రపతి లాంటి పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు అన్ని పెద్ద సినిమాలే కాకుండా ఒక చిన్న సినిమా చేద్దాం అని అనుకున్నారు. చిన్న సినిమాలు అంటే లవ్ స్టోరీలు, కామెడీ, హారర్ సినిమాలే కనిపిస్తున్నాయి. కానీ, జక్కన్నకి వాటి మీద పెద్దగా పట్టు లేదు. అప్పుడు అతను ఒక చిన్న సినిమా తక్కువ బడ్జెట్ తో తెద్దాం అనుకున్నారు. అప్పుడు అతని ఆలోచన వాళ్ల నాన్న చెప్పిన ఈగపైకి మళ్లింది. అప్పుడే దానిని డెవలప్ చేయడం మొదలు పెట్టారు. బలహీనుడు బలవంతుడిపై గెలవడం లాంటి కాన్సెప్ట్ జనాల్లోకి తొందరగా వెళ్తుందని ఈగని డెవలప్ చేయడం మొదలుపెట్టారు. అయితే, సినిమా మొదలు పెట్టే ముందు రూ.2.5 కోట్ల బడ్జెట్ అనుకున్నారట.. కొన్ని థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలనుకున్నారు. కానీ, 2.5 కోట్లలో సినిమా అవ్వడం లేదు.. దాంతో నిర్మాత సురేష్ బాబు వచ్చి బడ్జెట్ గురించి ఆలోచించొద్దు ముందు కథ సిద్ధం చెయ్యండి అనడంతో కథ సిద్ధం చేశారు. అది వాళ్లు అంచనా వేసినకంటే పెద్ద కథ అయ్యింది. 

ఈగ అనే చిత్రంతో జక్కన్నకి విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటో అర్థమైంది. కార్టూన్స్‌లో అంత రేయాలిస్టిక్కుగా అనిపించదు. అందుకే చూసే వాళ్లకి అది నిజమైన ఈగ అనిపించాలి అని ఆ పనులు అన్ని'మకుట 'వాళ్ళకి అప్పగించారు. ఈగను తయారు చేయడం దానితో మనకు కావాల్సిన భావాలను పలికించడం, మనుషులతో సైగలు చేయడం. అసలు ఈగ ఎలా ఉండాలి? దాని డిజైన్ ఎలా ఉండాలి? ఆ పనులు అన్ని మకుట వాళ్లకి అప్పగించారు. కొన్ని నెలల తర్వాత వాళ్ళు ఒక ఈగ వీడియో తయారు చేసి చూపించారు అది చూసిన జక్కన్నకి ప్రాణం పోయినంత పని అయ్యిందట.. ఆ వీడియోలో అది అసలు ఈగలా లేదు. అప్పటికే రూ. 10కోట్లు ఖర్చు అయ్యింది.. మళ్లీ మకుట వాళ్లని కూర్చోపెట్టి ఈగ ఎలా ఉండాలి అని వాళ్లకి వివరించారు. మళ్లీ మొత్తం మొదటి నుండి మొదలు పెట్టమని చెప్పానని. అసలు ఈగ ఎలా ఉంటుంది? అన్న దానికోసం ఈగలను పట్టుకొని వీడియోస్, ఫొటోస్ తీయడం మొదలు పెట్టాం దాని కోసం ప్రత్యేకమైన లెన్స్ కూడా తీసుకొచ్చామని గుర్తుచేసుకున్నారు. లైట్స్ వేసి తెద్దాం అనుకుంట ఈగలు ఎగిరిపోతున్నాయి. దాంతో ఈగలను ఫ్రిడ్జ్ లో పెట్టి అవ్వి అపస్మాతిక స్థితిలోకి వెళ్లాక ఫొటోస్ తీశాం. ఆ ఫొటోస్ లో ఈగ భయంకరంగా ఉండేది. ఆయా ఫొటోస్ ప్రకారం స్కెచ్ వేపించాం. అది చుసిన తర్వాత మనసు కుదుటపడినట్టు జక్కన్న తెలిపారు.