#RRR బ్యాక్‌డ్రాప్ లీక్‌...

#RRR బ్యాక్‌డ్రాప్ లీక్‌...
మారిన ట్రెండ్‌లో టాలీవుడ్ సినిమా ప‌రుగులెత్తుతోంద‌నే చెప్పాలి. రొటీన్ క‌థాంశాలతో నాలుగు పాట‌లు, ఐదు ఫైట్స్ అన్న చందంగా క‌థ‌లు లేవు. చాలా డీప్‌గా మ్యాట‌ర్ ఉన్న క‌థ‌ల్నే మ‌న ద‌ర్శ‌కులు ఎంచుకుంటున్నారు. ఎమోష‌న్ ప‌రంగా, లాజిక్‌ల ప‌రంగా బెస్ట్ కంటెంట్‌నే ఎంపిక చేసుకుంటున్నారు. ప్ర‌స్తుత ట్రెండ్‌లో వెళుతూనే భ‌విష్య‌త్‌కి బాట‌లు వేసే క‌థ‌ల్ని ఎంచుకుంటున్నారు. ఇది శుభ‌ప‌రిణామం. ఇటీవ‌లే రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన `రంగ‌స్థ‌లం-1985` సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. గోదారి నేటివిటీ, భాష‌, యాస‌, సంస్కృతి ప్ర‌జ‌ల‌కు గొప్ప‌గా క‌నెక్ట‌వ్వ‌డంతో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 200 కోట్లు వ‌సూలు చేస్తోంది. లేటెస్టుగా ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించ‌నున్న మ‌ల్టీస్టారర్ క‌థాంశం ఇదే త‌ర‌హాలో న‌వ్య‌పంతాలో ఉంటుంద‌ని తెలు్తోంది. 1980 ఒలింపిక్ బ్యాక్‌డ్రాప్ క‌థాంశ‌మిది. గుణ్ణం గంగ‌రాజు క‌థ‌ను అందించారు. ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌ హార్స్ రైడ‌ర్‌గా న‌టిస్తుంటే, ఎన్టీఆర్ బాక్స‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. పైగా ఆ ఇద్ద‌రూ అన్న‌ద‌మ్ములుగా క‌నిపిస్తార‌ని క‌థ లీకైంది. క్రీడ‌ల నేప‌థ్యం కాబ‌ట్టి అందుకు అవ‌స‌ర‌మైన లుక్ కోసం ఆ ఇద్ద‌రూ శ్ర‌మిస్తున్నారు. ఎన్టీఆర్ బాక్స‌ర్ రోల్ కోస‌మే ప్ర‌స్తుతం క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ట‌. వాస్త‌వానికి ఇదంతా త్రివిక్ర‌మ్ కోసం అని ప్ర‌చార‌మైనా.. తార‌క్ టార్గెట్ జ‌క్క‌న్న అని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ఇద్ద‌రినీ ఇంట‌ర్నేష‌న‌ల్ కోచ్ ట్రైన‌ప్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డి.వి.వి.దాన‌య్య‌ దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్ తో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా బ‌హుభాషా చిత్రంగా తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ప్రీప్రొడ‌క్ష‌న్ సాగుతోంది. కీర‌వాణి సంగీతం అందిస్తున్నార‌ని తెలుస్తోంది.