ప్లాస్మా దానం చేసి ప్రాణాలు కాపాడండి..

 ప్లాస్మా దానం చేసి ప్రాణాలు కాపాడండి..

కరోనా నుంచి కోలుకున్న వారు వీలైనంత త్వరగా ప్లాస్మా దానం చేసి ప్రాణాలను కాపాడాలని ఎస్‌ఎస్‌ రాజమౌళి ట్విటర్‌ ద్వారా కోరారు. మన శరీరంలో ఏర్పడిన కరోనా ప్రతి బంధకాలు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయని తెలిపారు. ఈలోపే ప్లాస్మా దానం చేస్తే వేరే వారి ప్రాణాన్ని కాపాడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. తన శరీరంలో యాంటీ బాడీస్‌ కోసం పరీక్ష చేయించుకోగా ఐజీజీ లెవల్స్‌ 8.62 ఉన్నాయని, ప్లాస్మా దానం చేయాలంటే 15 కంటే ఎక్కువ ఉండాలని తెలిపారు. పెద్దన్న కీరవాణి, భైరవ మంగళవారం ఉదయం ప్లాస్మా దానం చేశారని జక్కన్న పేర్కొన్నారు.