త్వరలో టైటిల్ చెప్పబోతున్న రాజమౌళి !

త్వరలో టైటిల్ చెప్పబోతున్న రాజమౌళి !

 

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడి పెళ్లి కారణంగా ఆర్ఆర్ఆర్ సినిమా చిత్రీకరణకు కొంత బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు ఆ పెళ్లి వేడుక ముగియడంతో తిరిగి ఆర్ఆర్ఆర్ సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు ఆయన.  ఈ షెడ్యూల్ మొదలవడానికి ముందే ఆయన సినిమా టైటిల్ ఏమిటో అనౌన్స్ చేస్తారని టాక్.  దీంతో ఇన్ని రోజులు అసలు ఆర్ఆర్ఆర్ అంటే పూర్తి అర్థం ఏమిటి, ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమేనా.. అసలు టైటిల్ వేరే ఉందా అనే సందేహాలతో సతమతమైపోతున్న సినీ ప్రేక్షకులకు ఒక క్లారిటీ వచ్చే అవకాశముంది.