‘గీత గోవిందం’పై దర్శకధీరుడి ప్రశంసలు...

‘గీత గోవిందం’పై దర్శకధీరుడి ప్రశంసలు...

విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'గీత గోవిందం'పై ప్రశంసలు కురిపించారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి... విజయ్ దేవరకొండ హీరోగా... రష్మిక మండన్న హీరోయిన్‌గా... పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆంజనేయులు, సోలో, శ్రీరస్తు శుభమస్తు సినిమాల తరువాత పరశురామ్ చేసిన గీతా గోవిందం ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంటుండగా... దర్శకుడు రాజమౌళి ఈ మూవీపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.

'గీత గోవిందం' నవ్వుల పంట... విజయ్ దేవరకొండ... అర్జున్ రెడ్డి తర్వాత చేసిన ఓ మంచి ఎంపిక ఇది. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడో అతనికి మంచి క్లారిటీ ఉంది. ఈ చిత్రం మొత్తం చాలా సరదాగా సాగిపోతోంది... సినిమాని దర్శకుడు పరశురామ్ బాగా తెరకెక్కించారు... సినిమాలో రాహుల్ రామకృష్ణ, అన్నపూర్ణమ్మ, వెన్నెల కిషోర్ బాగా నటించారు... 'గీత గోవిందం' చిత్ర యూనిట్‌కు నా అభినందనలు’’ అంటూ ట్వీట్ చేశారు దర్శకధీరుడు. ఇక ఏదైనా మూవీపై దర్శకధీరుడు స్పందించాడంటే... ఆ సినిమాకు మరింత పబ్లిసిటీ వచ్చేసినట్టే... ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ... వసూళ్ల పరంగాకూడా దూసుకెళ్లడం ఖాయం అంటున్నారు.