క్లైమాక్స్‌లో 'ఆర్ఆర్ఆర్'... ఆరు రోజులు అక్కడే...

క్లైమాక్స్‌లో 'ఆర్ఆర్ఆర్'... ఆరు రోజులు అక్కడే...

బాహుబలితో తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తర్వాత ప్రాజెక్టు 'ఆర్ఆర్ఆర్'పై వచ్చే ఏ న్యూస్ అయినే హాట్ టాపికే... బాహుబలి గ్యాస్ తీసుకున్న రాజమౌళి.. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ కాస్టింగ్‌కు తోడు, కథపై కూడా కొంత క్లారిటీ రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక, ఆర్ఆర్ఆర్‌ క్లైమాక్స్ షూటింగ్‌కు మన్యంకు వెళ్తోంది చిత్ర యూనిట్.. విశాఖ ఏజెన్సీలోని మోదాపల్లి, డల్లాపల్లి మండలాల్లో కాఫీ తోటల్లో ఈ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. 

ఇప్పటికే లోకేషన్స్‌ను పరిశీలించిన చిత్ర యూనిట్.. ఇవాళ్టి నుంచి ఆరు రోజుల పాటు సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సీన్స్ షూట్ చేయనుంది. ఇప్పటికే అక్కడ తీయాల్సిన సన్నివేశాల గురించి దర్శకుడు రాజమౌళి... అసిస్టెంట్‌ డైరెక్టర్లకు వివరించారు. ఈ మల్టీస్టారర్‌ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ నటిస్తుండగా.. ఈ షూటింగ్‌ స్పాట్‌కు ఏదో ఒక రోజు జూనియర్‌ ఎన్‌టీఆర్‌ వస్తారని చెబుతున్నారు. అల్లూరి సీతారామరాజు, కొమరమ్‌భీమ్‌ల కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుండడంతో... తెల్లదొరలపై పోరాటానికి సంబంధించిన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ.. వచ్చే ఏడాది జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.