ఆర్ఆర్ఆర్ టెస్ట్ షూట్ గురించి చెప్పిన సినిమాటోగ్రాఫర్... 

ఆర్ఆర్ఆర్ టెస్ట్ షూట్ గురించి చెప్పిన సినిమాటోగ్రాఫర్... 

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం తీస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. అయితే ఆయన ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాలు హిట్ కావడం విశేషం. అందుకుగల కారణాలలో ఒకటి రాజమౌళి సక్సెస్ ఫుల్ టీమ్. అందులోనూ ముఖ్యంగా డి ఓ పి సెంథిల్ కుమార్. చాల ఏళ్లుగా  రాజమౌళి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు ఈయన. బాహుబలికి కూడా సెంథిల్ కుమార్ పని చేసాడు. అలాగే ఇప్పుడు రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ పనిచేస్తున్నాడు. అయితే కరోనా  కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఇక ఈ మధ్య ప్రభుత్వం షూటింగ్స్ కు అనుమతి ఇచ్చిన తర్వాత ఆర్ఆర్ఆర్ టీం టెస్ట్ షూట్ నిర్వహించాలని భావించింది. కానీ అది జరగలేదు. దానికి గల కారణాల గురించి సెంథిల్ కుమార్ ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూ ఓ చెప్పారు. ''మాములుగా లాక్ డౌన్ ముందు ఆర్ఆర్ఆర్ షూట్ లో కనీసం 500 నుండి 600 మంది పాల్గొనేవారు. కానీ ఇప్పుడు షూటింగ్ లో 50-60 మందికంటే ఎక్కువగా ఉండకూడదు అని ప్రభుత్వం నియమాలు పెట్టింది. అయిన కూడా ఓసారి టెస్ట్ షూట్ చేద్దాం అనుకున్నాం. అయితే మన దగ్గర కరోనా వేగంగా వ్యాపిస్తుండటం తో దానిని జరపలేదు అని'' సెంథిల్ కుమార్ వివరించారు.