కేసీఆర్‌ చెన్నై అందుకు రాలేదు: స్టాలిన్‌

కేసీఆర్‌ చెన్నై అందుకు రాలేదు: స్టాలిన్‌

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా ఇటీవల కేరళ ముఖ్యమంత్రి విజయన్‌తో భేటీ అయిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో నిన్న సమావేశమయ్యారు. ఈ భేటీపై స్టాలిన్‌ ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్రంట్‌ ఏర్పాటు చర్చల కోసం కేసీఆర్‌ చెన్నై రాలేదని, దైవ దర్శనాల కోసమే వచ్చారని వ్యాఖ్యానించారు. ఈక్రమంలోనే తనను మర్యాదపూర్వకంగా కలిశారని చెప్పారు. ఇక.. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌, బీజేపీయేతర ఫ్రంట్‌ ఏర్పాటుకు ఎలాంటి అవకాశాలూ లేవని స్టాలిన్‌ అన్నారు.