హౌరా స్టేషన్ లో తొక్కిసలాట...

హౌరా స్టేషన్ లో తొక్కిసలాట...

పశ్చిమ బెంగాల్ లోని హౌరా రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. 13మంది గాయపడ్డారు. ఓకేసారి మూడు రైళ్లు రావటంతో రైల్వే స్టేషన్ లో ఉన్నట్టుండి రద్దీ పెరిగింది. దీంతో ప్రయాణీకులు బయటకు వెళ్లేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైకి పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో కొందరు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనను రైల్వే అధికారులు దృవీకరించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.