రవితేజకు విలన్ గా స్టార్ నటుడు !

రవితేజకు విలన్ గా స్టార్ నటుడు !

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం విని ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా షూట్ త్వరలోనే మొదలుకానుంది.  ఈ సినిమాలో ప్రముఖ స్టార్ నటుడు మాధవన్ ప్రతినాయకుడి పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది.  మాధవన్ ఇంతకుముందు కూడ నాగ చైతన్య యొక్క 'సవ్యసాచి' చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించిన సంగతి తెలిసిందే.  ఇకపోతే విఐ ఆనంద్ ఈ సినిమాకు 'డిస్కో రాజా' అనే టైటిల్ అనుకుంటున్నారు.  ఈ చిత్రంలో పాయల్ రాజ్ ఫుత్, నాభ నటేష్ లు కథయికలుగా నటించనున్నారు.