స్టార్ కమెడియన్ పై బ్యాన్ విధించారా ?

స్టార్ కమెడియన్ పై బ్యాన్ విధించారా ?

మన తెలుగులో బ్రహ్మానందం ఎంత పాపులర్ హాస్య నటుడో తమిళనాట వడివేలు కూడ అంతే పాపులర్.  తన హాస్య చతురతతో స్టార్ హీరోల స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు వడివేలు.  కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఈ మధ్యే రీ ఎంట్రీ ఇచ్చారు.  

దర్శకుడు శింబు దేవన్ దర్శకత్వంలో 2006లో వడివేలు నటించిన 'హింసించే రాజు 23వ పులికేసి' సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే.  ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేశారు.  అందుకోసం వడివేలుకు భారీ రెమ్యునరేషన్ చెల్లించి, సెట్స్ కూడా వేశారు.  కానీ చిన్న చిన్న వివాదాలతో వడివేలు షూటింగుకు నో చెప్పారట.  దీంతో చిత్ర నిర్మాత శంకర్  మండలిలో పిర్యాదు చేశారు.  ఫిర్యాదును స్వీకరించిన కౌన్సిల్ సినిమాలో నటించడం లేదా నష్టపరిహారం కింద 9 కోట్లు చెల్లించమని వడివేలుకు సూచించారట. 

కానీ వడివేలు కౌన్సిల్ మాటల్ని లెక్కచేయకపోవడంతో ఇకపై ఆయనతో ఎవరూ పనిచేయవద్దని, ఆయన్ను బ్యాన్ చేశామని మండలి సభ్యులు నిర్మాతలు, దర్శకులకు నోటీసులు పంపారట.