మహేష్ 27వ సినిమా ఆ దర్శకుడితోనేనా?

మహేష్ 27వ సినిమా ఆ దర్శకుడితోనేనా?

మహేష్ వరసగా రెండు హిట్స్ కొట్టాడు.  భరత్ అనే నేను, మహర్షి.. ఈ రెండు కెరీర్లో మంచి విజయాలుగా నిలిచాయి.  మహర్షి సినిమా కెరీర్లో మంచి సినిమాగా నిలిచింది.  25వ సినిమా ఎలా ఉండాలని అనుకుంటారో అలానే ఉన్నది.  ఇప్పుడు 26వ సినిమాగా కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నారు.  దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.  అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నది.  

అయితే, మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నారు అన్నది సస్పెన్స్ గా మారింది.  సందీప్ రెడ్డి వంగ మహేష్ తో సినిమా చేయాలని అనుకున్నాడు కుదరకపోవడంతో బాలీవుడ్ సినిమాను లాక్ చేశారు.  గీతగోవిందం దర్శకుడు పరశురామ్ కూడా మహేష్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.  కానీ, ఎప్పుడు చేస్తారన్నది సస్పెన్స్.  కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మహేష్ సినిమా చేయబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.  ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలి.  అయితే, మహేష్ తో మహర్షి సినిమా చేసిన వంశి పైడిపల్లి కూడా లైన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది.  మహర్షి సినిమా సమయంలోనే వంశీతో మరో చేద్దామని హామీ ఇచ్చారు.  దీన్ని దృష్టిలో పెట్టుకొని వంశి కథను సిద్ధం చేశారని.  స్క్రిప్ట్ కు తుదిమెరుగులు దిద్దుతున్నారని సమాచారం.  పూర్తికాగానే మహేష్ కు స్క్రిప్ట్ ను వినిపిస్తారని తెలుస్తోంది.