విజయ్ దేవరకొండకు స్టార్ హీరోల సపోర్ట్

విజయ్ దేవరకొండకు స్టార్ హీరోల సపోర్ట్

హీరో విజయ్ దేవరకొండ తెలుగుతో పాటు తమిళ పరిశ్రమలో కూడా మార్కెట్ చేసుకోవడానికి ప్రయతనాలు చేస్తున్నారు.  అందుకే తన ప్రతి సినిమాను తెలుగుతో సమానంగా తమిళంలో విడుదల చేస్తున్నారు.  అప్పుడప్పుడు అక్కడి దర్శకులతో సినిమాలు చేస్తున్నారు.  ఇక ఆయన నటించిన కొత్త చిత్రం 'డియర్ కామ్రేడ్' తమిళంలో పెద్ద ఎత్తున విడుదలకానుంది. 

అందుకే అక్కడి ప్రమోషన్లు పెద్ద స్థాయిలోనే ప్లాన్ చేశారు.  వాటిలో భాగంగానే సినిమా తమిళ వెర్షన్ ట్రైలర్ ను స్టార్ హీరో సూర్య విడుదల చేశారు.  ఇక రేపు బెంగుళూరులో జరగనున్న 'డియర్ కామ్రేడ్' మ్యూజిక్ వేడుకకు కన్నడ స్టార్ హీరో, కె.జి.ఎఫ్ ఫేమ్ యాష్ హాజరుకానున్నారు.