'మహర్షి' వేడుకకు అతిథులెవరో తెలుసా !

'మహర్షి' వేడుకకు అతిథులెవరో తెలుసా !

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 1వ తారీఖున పీపుల్స్ ప్లాజాలో జరగనున్న సంగతి తెలిసిందే.  ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మహేష్ తన మిత్రులైన స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరినీ ఆహ్వానించారని వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి.  అయితే ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలుసుకోవాలని అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  మరి వారికి క్లారిటీ రావాలంటే నిర్మాతలు స్పందించాల్సిందే.