నాగ చైతన్య కోసం ఇద్దరు స్టార్ హీరోలు !

నాగ చైతన్య కోసం ఇద్దరు స్టార్ హీరోలు !

నాగ చైతన్య కొత్త చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు'.  మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 13వ తేదీన విడుదలకానుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ 9వ తేదీన భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు.  

విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరగనున్న ఈ వేడుకకు చైతన్య తండ్రి అక్కినేని నాగార్జునతో పాటు హీరో నాని కూడ హాజరుకానుండటం విశేషం. ప్రస్తుతం నాగార్జున, నానిలు కలిసి 'దేవదాస్' అనే మల్టీస్టారర్లో నటిస్తున్నారు.  ఇకపోతే ఈ 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రంలో చైతన్యకు జోడీగా అను ఇమ్మాన్యుయేల్, అత్తగా రమ్యకృష్ణ నటించారు.