గుడ్‌న్యూస్‌.. ఎస్బీఐ బంపరాఫర్..!

గుడ్‌న్యూస్‌.. ఎస్బీఐ బంపరాఫర్..!

పండుగల సమయంలో శుభవార్త చెప్పింది దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకిగ్ సంస్థ ఎస్బీఐ... దసరా, దీపావళి సందర్భంగా తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు పండుగ ఆఫర్లను ప్రకటించింది.  తమ కస్టమర్లకు గోల్డ్ లోన్, పర్సనల్ లోన్, కారు లోన్ వంటి రుణాలను అతి తక్కువ వడ్డీకే అందిస్తామని తెలిపింది. దీంతోపాటు ఈ రుణాలపై గతంలో ఉన్న ప్రాసెసింగ్ ఫీజును కూడా తగ్గించింది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా లోన్ అప్లై చేసుకుంటే ఎలాంటి ప్రాసెసింగ్ చెల్లించాల్సిన అవసరం లేదన్నది ఎస్బీఐ. గోల్డ్ లోన్‌పై వడ్డీ రేట్లను కూడా బ్యాంకు తగ్గించింది. ఇప్పుడు గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు 7.5 శాతం నుంచి ప్రారంభమవుతాయి. ఆఫర్ కింద తీసుకున్న రుణాన్ని మూడేళ్లలోపు తిరిగి చెల్లించాలి. దీంతో పాటు పర్సనల్ లోన్‌పై కూడా తగ్గింపులను ప్రకటించింది.