'ఐటీ గ్రిడ్స్‌లో సీన్ రీ కన్‌స్టక్షన్..!'

'ఐటీ గ్రిడ్స్‌లో సీన్ రీ కన్‌స్టక్షన్..!'

తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదంగా మారిన డేటా చోరీ కేసులో విచారణలో స్పీడ్ పెంచింది స్పెషల్ ఇన్వెస్ట్‌గేషన్ టీమ్ (సిట్‌).. ఈ కేసులో కేంద్ర బిందువుగా ఉన్న ఐటీ గ్రిడ్స్ సంస్థలో సీన్ రీ కన్‌స్టక్షన్ చేస్తున్నట్టు తెలిపారు సిట్ ఇంచార్జ్ స్టీఫెన్ రవీంద్ర. ఇప్పటికే తాము స్వాధీనం చేసుకున్న డేటాను ఎఫ్‌ఎస్‌ఎల్‌కి పంపించామన్న ఆయన... ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక వచ్చిన తర్వాత కేసును మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఐటీ గ్రిడ్స్‌లో సీన్ రీ కన్‌స్టక్షన్ చేస్తున్నాం.. ఇప్పటి వరకు సేకరించిన డేటాని నిపుణుల సమక్షంలో  విశ్లేషిస్తున్నామని వెల్లడించారు. ఈ కేసులో గూగుల్, అమెజాన్ నుండి సమాచారం రావాల్సి ఉందని వెల్లడించిన స్టీఫెన్ రవీంద్ర. సాంకేతిక నిపుణుల సమక్షంలోనే డేటా విశ్లేషన చేస్తున్నామన్నారు. ఈ కేసును అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. క్లూస్ టీమ్‌తో మరోసారి ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు హైకోర్టులో ఐటీ గ్రిడ్స్ అశోక్‌బాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేస్తామని వెల్లడించారు స్టీఫెన్ రవీంద్ర.