ఆస్ట్రేలియా కెప్టెన్సీకి అర్హత సాధించిన స్మిత్...

ఆస్ట్రేలియా కెప్టెన్సీకి అర్హత సాధించిన స్మిత్...

కరోనా కారణంగా అంతర్జాతీయ క్రికెట్ మళ్ళీ ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుందనే దానిపై అందరికి సందిగ్ధం లో ఉన్న సమయంలో స్టీవ్ స్మిత్ రెండేళ్ల కెప్టెన్సీ నిషేధం నిన్న ఆదివారం తో ముగిసింది. దక్షిణాఫ్రికాతో  2018 లో జరిగిన టెస్ట్ సిరీస్ లో బాల్ ట్యాంపరింగ్ కుంభకోణంలో పాల్గొన్నందుకు స్మిత్ జట్టు నుండి ఒక ఏడాది పాటు తొలగించబడ్డాడు మరియు ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం వహించకుండా రెండు సంవత్సరాలు నిషేధించబడ్డాడు. అతని శిక్ష నిన్న ఆదివారం తో ముగిసింది మరియు అతను పిలిస్తే ఆస్ట్రేలియాకు కెప్టెన్ చేయవచ్చు. క్రికెట్ తిరిగి ప్రారంభమైనప్పుడు స్మిత్ కెప్టెన్సీకి తిరిగి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ప్రస్తుతం టిమ్ పైన్ ఆస్ట్రేలియా యొక్క టెస్ట్ జట్టుకు న్యాయకత్వం వహిస్తుండగా ఆరోన్ ఫించ్ వైట్ బాల్ క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు విజయవంతంగా నాయకత్వం నిర్వహిస్తున్నాడు. అయితే చూడాలి మరి ఈ సమయం లో మళ్ళీ స్మిత్ ఆసీస్ పగ్గాలు చేపడుతాడా... లేదా అనేది.