మొదటి సెషన్ లో ఆకట్టుకున్న భారత బౌలర్లు...

మొదటి సెషన్ లో ఆకట్టుకున్న భారత బౌలర్లు...

భారత్-ఆసీస్ ఈరోజు ప్రారంభమైన 4వ టెస్ట్ లో మొదటి సెషన్ పూర్తయ్యింది. ఈ మ్యాచ్ లో అనుభవం లేని బౌలింగ్ విభాగం తో ఆడుతుంది భారత జట్టు. అయితే మొదటి సెషన్ పూర్తయే సమయానికి 65/2 తో నిలిచింది ఆసీస్. భారత పేసర్లు సిరాజ్, శార్దుల్ ఠాకూర్ ఒక్కో వికెట్ సాధించారు. అయితే అనుభవం లేని ఈ భారత బౌలర్లు పరుగులను కట్టడి చేస్తున్నారు... కానీ వికెట్లు సాధించలేకపోతున్నారు. ఇక ప్రస్తుతం ఆసీస్ ఆటగాళ్లు లాబుస్చాగ్నే(19), స్టీవ్ స్మిత్(30) తో బ్యాటింగ్ కొనసాగిస్తూ ఇప్పటికే 48 పరుగుల భాగసౌమ్యం నెలకొల్పారు. చూడాలి మరి ఈ భాగసౌమ్యని ఏ బౌలర్ విడదీస్తాడు అనేది.