జోఫ్రా బౌన్సర్...గాయంతో వెనుతిరిగిన స్టీవ్ స్మిత్ !

జోఫ్రా బౌన్సర్...గాయంతో వెనుతిరిగిన స్టీవ్ స్మిత్ !

లార్డ్స్ మైదానం వేదికగా యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఏడాది నిషేధం తర్వాత తిరిగి ఆసీస్ జట్టులో చోటు దక్కించుకున్న స్మిత్ ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. మొదటి టెస్ట్‌ రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన స్మిత్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ స్మిత్ రాణిస్తున్నాడు. మూడో రోజు లంచ్ సమయానికి అర్థ శతకం సాధించి జట్టుకు ఆధిక్యం అందించేందుకు కృషి చేస్తున్నాడు. అయితే మంచి ఫాంలో ఉన్న ఆయన జోఫ్రా ఆర్చర్ వేసిన బౌన్సర్ మెడకు తాకడంతో గాయపడాల్సి వచ్చింది. ఈ దెబ్బకు ఆయన రిటైర్ హార్ట్ అవ్వాల్సి వచ్చింది. దెబ్బ తగిలాక కూడా ఆయన క్రీజుకి వచ్చాడు. పన్నెండు పరుగులు చేశాక వెనుతిరగాల్సి వచ్చింది. లార్డ్స్‌ మైదానంలో కష్టతరమైన పరిస్థితులలో ఆస్ట్రేలియా యొక్క టాప్-సిక్స్ విఫలమైనందున, స్మిత్ గట్టెక్కిస్తాడని భావించారు. అయితే ఆయన అనూహ్యంగా వెనుతిరగాల్సి వచ్చింది.