భారీ లాభాల‌తో స్టాక్ మార్కెట్ ఆరంభం

భారీ లాభాల‌తో స్టాక్ మార్కెట్ ఆరంభం

రాత్రి అమెరికా మార్కెట్‌లో వ‌చ్చిన షార్ట్ క‌వ‌రింగ్ ర్యాలీతో సూచీలు ప‌రుగులు తీశాయి. డిసెంబ‌ర్ నెల ఆరంభం నుంచి అమెరికా మార్కెట్లు నిస్తేజంగా ఉన్నాయి. ప్రతివారం క‌నీసం రెండు శాతం మేర క్షీణిస్తూ వ‌చ్చాయి. దాదాపు మార్కెట్ బేర్ ఫేజ్‌లోకి వెళుతోంద‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో రాత్రి షార్ట్ క‌వ‌రింగ్ వ‌చ్చింది. ఒక్క‌సారిగా కొనుగోళ్ళు పెర‌గడంతో ఇన్వెస్ట‌ర్లు త‌మ పొజిష‌న్స్ క‌వ‌ర్ చేసుకునేందుకు ప‌రుగులు తీశారు. దీంతో నాస్ డాక్ ఏకంగా దాదాపు ఆరు శాతం పెర‌గ్గా, డౌజోన్స్, ఎస్ అండ్ పీ 500 సూచీలు 500 పాయింట్ల వ‌ర‌కు పెరిగాయి. ఉద‌యం ఆసియా మార్కెట్ల‌లో కూడా ఇదే త‌ర‌హా షార్ట్ క‌వ‌రింగ్ ర్యాలీ వ‌చ్చింది. ఇటీవ‌ల 5 శాతం దాకా క్షీణించిన జ‌పాన్ నిక్కీ ఒకే ఒక్క సెష‌న్‌లో ఇవాళ 3.5 శాతం రిక‌వ‌రైంది. ఇత‌ర సూచీలు భారీ లాభాల‌తో ట్రేడ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌న మార్కెట్లు కూడా భారీ లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. అంత‌ర్జాతీయ మార్కెట్లు భారీగా ప‌త‌నం చెందిన మ‌న న‌ష్టాలు ఒక‌మోస్త‌రుగానే ఉన్నాయి. దీంతో ఇవాళ మ‌న మార్కెట్‌లో సూచీలు ఒక మోస్త‌రు లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. పైగా ఇవాళ డిసెంబ‌ర్ నెల డెరివేటివ్స్  క్లోజింగ్‌. నిఫ్టి ప్ర‌స్తుతం 70 పాయింట్ల లాభంతో 10800 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. అన్ని రంగాల షేర్ల సూచీలూ గ్రీన్‌లో ఉన్నాయి. ఐటీ, మెట‌ల్ సూచీలు ఒక శాతం పైగా లాభ‌ప‌డ‌గా, పీఎస్‌యూ బ్యాంకు షేర్ల సూచీ ఒక శాతం దాకా పెరిగింది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో టీసీఎస్‌, వేదాంత‌, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌, ఓఎన్‌జీసీ, ఇన్ఫోసిస్ ఉన్నాయి.  ఇక న‌ష్ట‌పోయిన నిఫ్టి షేర్ల‌లో హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐఓసీ, భార‌తీ ఎయిర్‌టెల్‌, జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉన్నాయి. ప్ర‌స్తుతం ఓ మాదిరి లాభాల‌తో  ట్రేడ‌వుతున్నా... డెరివేటివ్స్ క్లోజింగ్ కార‌ణంగా మార్కెట్ తీవ్రస్థాయిలో హెచ్చుత‌గ్గులు ఉండొచ్చు. మిడ్ సెష‌న్ త‌ర‌వాత మార్కెట్‌లో మ‌రిన్ని మార్పుల‌కు అవకాశ‌ముంది.