షేర్ మార్కెట్‌: కొన‌సాగుతున్న అప్‌ట్రెండ్‌

షేర్ మార్కెట్‌: కొన‌సాగుతున్న అప్‌ట్రెండ్‌

అంత‌ర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా మ‌న మార్కెట్లు మాత్రం ఆక‌ర్ష‌ణీయ లాభంతో ప్రారంభ‌మైంది. అమెరికా మార్కెట్లు రాత్రి న‌ష్టాల‌తో క్లోజ్ కాగా, ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడ‌వుతున్నాయి. లాభాలు ప‌రిమితంగానే ఉన్నాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో డాల‌ర్ కాస్త బ‌ల‌హీన‌ప‌డింది. ముడి చ‌మురు ధ‌ర‌ల జోరు కూడా త‌గ్గ‌డం ఆసియా మార్కెట్ల‌కు క‌లిసి వ‌చ్చిన అంశం. నిఫ్టి ప్ర‌స్తుతం 65 పాయింట్ల లాభంతో 11755 పాయింట్ల వ‌ద్ద ట్రేడ‌వుతోంది. మార్కెట్‌కు అధిక స్థాయిల్లోనూ  మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఈనెల డెరివేటివ్ మార్కెట్ చాలా త‌క్కువ రోజుల‌కే పూర్తి కానుంది. గురు, శుక్ర మార్కెట్ల‌కు సెల‌వు కావ‌డంతో మార్కెట్‌లో హెచ్చుత‌గ్గులు అధికంగా ఉండొచ్చు. ఇవాళ మార్కెట్‌లో దాదాపు అన్ని రంగాల షేర్ల‌కు మ‌ద్ద‌తు ల‌భించింది. ఒక్క రియాల్టి షేర్లు త‌ప్ప‌. అయితే ఏ రంగానికి భారీ లాభాలు లేవు. దిశ లేకుండా ముందుకు సాగుతున్న మార్కెట్‌పై ఇన్వెస్ట‌ర్ల‌లో ఆందోళ‌న క‌న్పిస్తోంది. ఈ నెలాఖ‌రులోనే మార్కెట్‌లో ఒడుదుడుకులు అధికం కావొచ్చు. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐఓసీ, వేదాంత‌, ఇన్‌ఫ్రాటెల్‌, కోల్ ఇండియా ఉన్నాయి. దాదాపు అన్ని షేర్లు రెండు నుంచి మూడు శాతం వ‌ర‌కు పెరిగాయి. ఇక న‌ష్టాల్లో ఉన్న నిఫ్టి టాప్ లూజ‌ర్స్‌లో టాటా మోటార్స్‌, భార‌తీ ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉన్నాయి. న‌ష్టాలు చాలా నామమాత్రంగా ఉన్నాయి. ఇక బీఎస్ఈ సెన్సెక్స్‌లో టాప్ గెయిన‌ర్స్ ఇవి... టాటా స్టీల్ (పీపీ) స్పైస్ జెట్‌, దీప‌క్ ఫ‌ర్టిలైజ‌ర్స్‌, పీసీ జ్యువ‌ల్ల‌ర్స్‌, న‌వ‌కార్ కార్పొరేష‌న్ ఉన్నాయి. సెన్సెక్స్ టాప్ లూజ‌ర్స్‌లో ఆర్ కామ్‌, జెట్ ఎయిర్‌వేస్‌, బ‌ల‌రాం పూర్ చినీ, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌, ఒబెరాయ్ రియాల్టి షేర్లు ఉన్నాయి.