స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

అంత‌ర్జాతీయ మార్కెట్లు అనిశ్చితి మ‌ధ్య మ‌న మార్కెట్లు స్థిరంగా ప్రారంభ‌మ‌య్యాయి. దాదాపు  క్రితం ముగింపుస్థాయి వ‌ద్దే ప్రారంభ‌మైన నిఫ్టి ఇపుడు 11 పాయింట్ల న‌ష్టంతొ 11520 వ‌ద్ద ట్రేడ‌వుతోంది.  రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. నాస్ డాక్ నామమాత్ర‌పు లాభాల‌తో క్లోజ్ కాగా, ఇత‌ర సూచీలు అదే స్థాయి న‌స్టాల‌తో ముగిశాయి. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు న‌ష్టాల్లో ట్రేడ‌వుతున్నాయి. .జ‌పాన్ నిక్కీ ఒక్క‌టే స్థిరంగా క్రితం ముగింపు వ‌ద్ద  ట్రేడ‌వుతోంది.  అమెరికా ఫెడ‌ర‌ల్  స‌మావేశం రాత్రి ప్రారంభ‌మైంది.రెండు రోజ‌ల ఈ స‌మావేశం నిర్ణ‌యం కోసం మార్కెట్ ఎదురు చూస్తోంది. రాత్రి డాల‌ర్ స్వ‌ల్పంగా పెరిగింది. గ‌త కొన్ని రోజులుగా భారీగా బ‌ల‌ప‌డిన రూపాయి నిన్న 38 పైస‌లు క్షీణించింది. ఇవాళ మ‌రో ప‌ది పైస‌లు క్షీణించింది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో.టాప్ గెయిన‌ర్స్ జాబితాలో ఇండియా బుల్స్ హౌసింగ్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హిందాల్కో, టెక్ మ‌హీంద్రాల‌ ఉన్నాయి. ఇక టాప్ లూజ‌ర్స్ జాబితాలో జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ, బీపీసీఎల్‌, కోల్ ఇండియా షేర్లు ఉన్నాయి.  బీఎస్ఈలో ఆర్ కామ్ ఇవాళ కూడా ప‌ది శాతం పెరిగింది. భెల్‌, థైరోకేర్‌, ఇండియా బుల్స్ రియ‌ల్ ఎస్టేట్‌, స్పైస్ జెట్ షేర్లు అయిదు శాతం దాకా పెరిగాయి. జూబిలియంట్ ఫుడ్స్‌, జీ ఎంట‌ర్ టైన్‌మెంట్‌, జెట్ ఎయిర్‌వేస్ షేర్లు న‌ష్టాల్లో ముందున్నాయి.