నిఫ్టి ఎలా ముగిసిందంటే...

నిఫ్టి ఎలా ముగిసిందంటే...

అంతర్జాతీయ మార్కెట్లకు తోడు దేశీయంగా నిరాశాజనక డేటా రావడంతో స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాలతో క్లోజైంది. ఉదయం నుంచి ఒక మోస్తరు నష్టాలతో ట్రేడైన నిఫ్టి... మిడ్‌ సెషన్‌లో ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి జారుకుంది. ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి 50 పైసలకు పైగా క్షీణించడంతో అనేక షేర్లు భారీగా నష్టపోయాయి. మరోవైపు నిన్న వెలువడిన ఆటో నంబర్లు చాలా నిరాశజనకంగా ఉండటంతో అనేక ఆటోమొబైల్‌ కంపెనీ షేర్లు భారీ నష్టాలతో ముగిశాయి. అలాగే మౌలిక రంగాల వృద్ధి రేటు పతనం కావడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ముడి చమురు ధరలు ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి ఇవాళ ఒకదశలో 10895ను తాకినా తరవాత 10735కి పడిపోయింది. క్లోజింగ్‌లో స్వల్పంగా కోలుకుని 117 పాయింట్ల నష్టంతో 10792 వద్ద ముగిసింది. నిఫ్టిలో కేవలం 9 షేర్లు మాత్రమే లాభాలతో ముగిశాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో సన్‌ ఫార్మా, ఇన్‌ఫ్రాటెల్‌, టీసీఎస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్ స్వల్ప లాభాలతో ముగిశాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో ఐషర్‌  మోటార్స్‌ ఏకంగా 9.4 శాతం నష్టపోగా.. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ అయిదున్నర శాతం క్షీణించింది. తరవాతి స్థానాల్లో ఉన్న టాటా స్టీల్‌, వేదాంత, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు నాలుగు శాతంపైగా నష్టపోయాయి.