క్లోజింగ్‌లో నిఫ్టి లాభాలెందుకు తగ్గాయి?

క్లోజింగ్‌లో నిఫ్టి లాభాలెందుకు తగ్గాయి?

ఒకదశలో భారీ లాభాలు గడించిన మార్కెట్‌ తరవాత సగం వరకు లాభాలను కోల్పోయింది. అమెరికా,ఆసియా మార్కెట్ల భారీ లాభాల నేపథ్యంలో మన మార్కెట్లు కూడా ఒక మోస్తరు లాభాలతో ప్రారంభమయ్యాయి.  ఒకదశలో 10750 స్థాయిని తాకిన నిఫ్టి తరవాత 10835కి చేరాయి. ఆసియా ఆశించిన స్థాయిలో లాభపడినా... మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్రం నిరాశాజనకంగా ఉండటంతో నిఫ్టి చాలా వరకు లాభాలు కోల్పోయింది. ఎట్టకేలకు 10804 వద్ద అంటే 44 పాయింట్ల లాభంతో క్లోజైంది. లాభనష్టాలు పొందిన షేర్ల నిష్ప్తత్తి 1ః1లో ఉన్నాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో అత్యధికంగా లాభపడిన షేరు యాక్సిస్‌ బ్యాంక్‌. ఈ బ్యాంక్‌ షేర్‌ 2.8 శాతం పెరగ్గా తరవాతి స్థానంలో ఇన్‌ఫ్రాటెల్‌, టాటా మోటార్స్‌, టైటాన్‌, గ్రాసిం షేర్లు ఉన్నాయి. ఇక నష్టాలు పొందిన షేర్లలో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నాలుగున్నర శాతం నష్టపోయింది. బజాజ్‌ ఆటో మూడు శాతం తగ్గింది. డాక్టర్‌ రెడ్డిస్‌, ఎస్‌ బ్యాంక్‌, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు ఒక శాతంపైగా నష్టంతో ముగిశాయి.