స్టాక్‌ మార్కెట్‌... చివర్లో జోష్‌... 

స్టాక్‌ మార్కెట్‌... చివర్లో జోష్‌... 

చివరి 45 నిమిషాల్లో భారీగా అందిన  కొనుగోళ్ళతో నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ముగిసింది. ఉదయం 40 పాయింట్ల లాభంతో నిఫ్టి ప్రారంభమైన తరవాత వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా నిఫ్టి ఒకదశలో11609 పాయింట్లకు పడిపోయింది. ప్రధానంగా ఇన్నాళ్ళూ ఆదుకున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు డీలా పడ్డాయి. మరోవైపు చిన్న ప్రైవేట్‌ కంపెనీలు భారీగా లాభపడ్డాయి. లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌, ద సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ షేర్లు భారీగా లాభపడ్డాయి. 2.45 గంటల నుంచి మార్కెట్‌ పరుగు అందుకుంది. ఒకదశలో 11689 పాయింట్లకు చేరి... క్లోజింగ్‌లో 68 పాయింట్ల లాభంతో 11665 వద్ద ముగిసింది.

యూరో మార్కెట్లు నష్టాల నుంచి లాభాల్లో చేరుకోవడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ మెరుగైంది. నిఫ్టి షేర్లలో టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌  టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక టాప్‌ లూజర్స్‌లో పవర్‌ గ్రిడ్‌, బ్రిటానియా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎస్‌బీఐ, డాక్టర్‌ రెడ్డీస్‌ ఉన్నాయి. ఇతర షేర్లలో దీవాన్‌ హౌసింగ్‌ షేర్‌ 10 శాతం లాభపడగా, ఐడియా 8 వాతం, సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ 7 శాతం, పీసీ జ్యువెల్లర్స్‌ 7 శాతం చొప్పున లాభపడ్డాయి. బీఎస్‌ఈలోనూ దాదాపు ఇవే షేర్లు లాభపడ్డాయి. నష్టపోయినవాటిలో ఆర్‌కామ్‌, శ్రీరామ్‌ సిటీ, హెచ్‌సీసీ, టోరెంట్‌ ఫార్మా, పీఎన్‌బీ హౌసింగ్‌ ఉన్నాయి.