స్థిరంగా ముగిసిన నిఫ్టి

స్థిరంగా ముగిసిన నిఫ్టి

రోజంతా మార్కెట్‌ తీవ్ర ఒడుదుడుకులకు లోనైంది. ఆరంభంలో 34 పాయింట్లు లాభంతో ప్రారంభమైంది. అదే ఇవాళ్టి గరిష్ఠ స్థాయి అక్కడి నుంచి క్షీణిస్తూ వచ్చిన నిఫ్టి ఒకదశలో 11,864 పాయింట్ల కనిష్ఠ స్థాయికి చేరింది. చివర్లలో దిగువ స్థాయిలో వచ్చిన మద్దతు  కారణంగా స్వల్పంగా కోలుకుని 11,928 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రధానంగా బ్యాంక్‌ నిఫ్టి కోలుకోవడమే దీనికి ప్రధాన కారణం. నిన్న అమెరికా మార్కెట్లు పనిచేయకపోవడంతో... ఇవాళ ఉదయం ఆసియా మార్కెట్లు డల్‌గా ట్రేడయ్యాయి. మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు ఆరంభంలో లాభం ఉన్నా...  ఇపుడు అరశాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు దిగువ స్థాయిలోనే ట్రేడవుతున్నాయి. ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి స్వల్పంగా బలహీనపడింది. నిఫ్టి ప్రధాన షేర్లలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్‌ 5 శాతం పైగా లాభంతో ముగిసింది. సోనీ కంపెనీకి వాటా విక్రయించనుందన్న వార్తలతో ఈ కౌంటర్‌లో మద్దతు కన్పించింది. టాప్‌ గెయినర్స్‌లో ఎస్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, కోల్‌ ఇండియా, పవర్‌ గ్రిడ్‌ కూడా ఉన్నాయి. ఇక నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో ఇన్‌ఫ్రాటెల్‌, బజాజ్‌ ఆటో, హీరో మోటోకార్ప్‌, గ్రాసిం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఉన్నాయి. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ప్రధాన షేర్లలో టాప్‌ గెయినర్స్‌ జాబితాలో వెంకీస్‌, ఆర్‌ పవర్‌, టైమ్‌ టెక్నో, టీమ్‌ లీజ్‌తో పాటు వి మార్ట్‌ కూడా ఉంది. ఇక సెన్సెక్స్‌ టాప్‌ లూజర్స్‌లో మనపసంద్‌ ఇండస్ట్రీస్‌, శంకర బిల్డింగ్‌ ప్రాపర్టీస్‌, డీసీఎం శ్రీరామ్‌, బేయర్‌ కార్పొరేషన్‌, ఐడీఎఫ్‌సీ ఉన్నాయి.