నష్టాలతో ముగిసిన నిఫ్టి

నష్టాలతో ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. చైనా డేటా చాలా నిరుత్సాహకరంగా ఉండటంతో ఉదయం ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెలవు కారణంగా జపాన్‌ మార్కెట్లకు సెలవు. ఇతర మార్కెట్లలో హాంగ్‌సెంగ్‌ ఒకశాతంపైగా నష్టపోగా, ఇతర మార్కెట్లు అదే స్థాయిలో తగ్గాయి. మిడ్ సెషన్‌ నుంచి మొదలైన యూరో మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 60కి దిగినా... డాలర్‌తో రూపాయి విలువ 30 పైసలు తగ్గడం విశేషం. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు కూడా ఒకదశలో స్వల్ప నష్టంలో ఉన్న మార్కెట్ల్‌ తరవాత పెరుగుతూ వచ్చింది. నిఫ్టి ఒకదశలో వంద పాయింట్లు తగ్గినా... తర్వాత 57 పాయింట్ల నష్టంతో 10737 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ కూడా 156 పాయింట్ల నష్టంతో ముగిసింది. నిఫ్టి ప్రధాన షేర్లలోఎస్‌ బ్యాంక్‌ 5.8 శాతం లాభంతో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. తరవాతి స్థానంలో ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మా, బజాజ్ ఫైనాన్స్‌, మారుతీ ఉన్నాయి. ఇక నష్టాలతో ముగిసిన నిఫ్టి ప్రధాన షేర్లలో విప్రో టాప్‌లో ఉంది. ఈ షేర్‌ ఇవాళ 5 శాతం నష్టపోయింది. తరువాతి స్థానంలో ఉన్న గెయిల్‌ కూడా 4 శాతం తగ్గింది. తరువాతి స్థానాల్లో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌ అండ్‌ టీ ఉన్నాయి.