10,650 దిగువన క్లోజైన నిఫ్టి

10,650 దిగువన క్లోజైన నిఫ్టి

స్టాక్‌ మార్కెట్‌ పతానానికి అడ్డూ ఆపూ లేకుండా ఉంది. వరుసగా ఆరో రోజు మార్కెట్‌ నష్టాలతో ముగిసింది. ఇవాళ పలు కీలక షేర్లు భారీగా క్షీణించడంతో నిఫ్టి ఏకంగా 83 పాయింట్లు క్షీణించింది. ఉదయం కేవలం 14 పాయింట్ల లాభంతో 10738 వద్ద ప్రారంభమైన నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే నష్టాల్లోకి జారుకుంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. చివర ఒక గంటలో కాస్త కోలుకున్నట్లు కన్పించినా.. చివర్లో వచ్చిన అమ్మకాల ఒత్తిడితో పలు కీలక షేర్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం ఆసియా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా మార్కెట్లలో శుక్రవారం నాటి ట్రెండ్‌ కొనసాగింది. మిడ్‌ సెషన్‌లో మొదలైన యూరప్‌ మార్కెట్‌ మిశ్రమంగా ఉన్నాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో ఇన్‌ఫ్రాటెల్‌, ఓఎన్‌జీసీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, టాటా మోటార్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ లాభాల్లో ముగిశాయి. నష్టాల్లో ముగిసిన నిఫ్టి షేర్లలో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, టీసీఎస్‌, రిలయన్స్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌, ఎస్‌ బ్యాంక్‌ ఉన్నాయి. అనిల్‌ అంబానీకి చెందిన ఆర్‌ కామ్‌ 12 శాతం పెరగ్గా, ఆర్‌ పవర్‌ 11 శాతం పెరిగింది.