మార్కెట్‌ శుభారంభం

మార్కెట్‌ శుభారంభం

షేర్‌ మార్కెట్‌ ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. గత శుక్రవారం యూరో, అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. వాణిజ్య గొడవలు సద్దు మణగడం, అమెరికా జాబ్‌ డేటా చాలా ప్రోత్సాహకరంగా ఉండటంతో ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నిక్కీ ఒక శాతంపైగా లాభపడగా, హంగ్‌ సెంగ్‌తో పాటు చైనా సూచీలు దాదాపు అదే స్థాయి లాభాలతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి 10744 స్థాయికి చేరింది. నిఫ్టిలో మెజారిటీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పీఎస్‌యూ బ్యాంకులు, ఐటీ షేర్లు కాస్త బలహీనంగా కన్పించినా ఇతర రంగాల షేర్లకు గట్టి మద్దతు లభిస్తోంది. అయితే లాభనష్టాలు ఒక మోస్తరుగా ఉన్నాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ 3 శాతం పెరగ్గా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ ఒకటిన్నర శాతం లాభంతో ట్రేడవుతోంది. హెచ్‌పీసీఎల్‌, టాటా మోటార్స్‌, ఎస్‌ బ్యాంక్‌ షేర్లు ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. ఇక నష్టపోయిన షేర్లలో గ్రాసిమ్‌ ముందుంది. ఈ షేర్‌ ఒక శాతంపైన నష్టపోగా... అదానీ పోర్ట్స్‌, టీసీఎస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, విప్రో నామ మాత్రపు నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఇక బీఎస్‌ఇలో వ్యాఖ్రంగే అయిదు లాభపడింది. జీఎన్‌ఎఫ్‌సీ మూడు శాతం పెరగ్గా, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా 3 శాతం లాభంతో ట్రేడవుతోంది.