స్టాక్‌ మార్కెట్‌లో టెన్షన్‌

స్టాక్‌ మార్కెట్‌లో టెన్షన్‌

భారత్‌, పాక్‌ సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్టాక్‌ మార్కెట్‌లో టెన్షన్‌ నెలకొంది. ఉదయం భారీ లాభాలను ఆర్జించిన నిఫ్టి ఒకదశలో 10,939 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. సరిహద్దులో పరిస్థితి అనూహ్యంగా ఉద్రిక్తంగా మారింది. బుడ్గావ్‌లో భారత  యుద్ధ విమానం కూలిపోయింది. సాంకేతిక కారణాలతో విమానం కూలిపోయినట్లు భారత్‌ ప్రకటించిన.. .మరుక్షణమే తాము రెండు భారత్‌ యుద్ధ విమానాలను కూల్చేశామని, ఒక పైలెట్‌ తమ అదుపులో ఉన్నాడని పాకిస్తాన్‌ చేసిన ప్రకటన మార్కెట్‌లో కలకలం రేగింది. దీంతో నిఫ్టిపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. దాదాపు 200 పాయింట్లు వరకు క్షీణించింది. 10,751 పాయింట్లకు చేరింది. ఈలోగా మార్కెట్‌ కాస్త కుదటపడినట్లు కన్పించింది. కాని తీవ్ర ఒడుదుడుకులకు మాత్రం తప్పడం లేదు. నిఫ్టి ప్రస్తుతం 43 పాయింట్ల నష్టంతో 10,791 వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. వాస్తవానికి ఫిబ్రవరి డెరివేటివ్స్‌ కాంట్రాక్ట్‌ రేపటితో పూర్తి అవుతుంది. మన మార్కెట్లలో దాదాపు 90 శాతం ట్రేడింగ్‌ డెరివేటివ్స్‌లోనే జరుగుతుంది. దీంతో క్యాష్‌ మార్కెట్‌తో పాటు డెరివేటివ్స్‌లో భారీ హెచ్చుతగ్గులు వస్తున్నాయి.