స్థిరంగా ముగిసిన నిఫ్టి

స్థిరంగా ముగిసిన నిఫ్టి

భారీ లాభాల తరవాత నిఫ్టి స్థిరంగా ముగిసింది. ఆరంభంలో స్వల్ప నష్టంతో ప్రారంభమై.. 10,758కి క్షీణించినా తరవాత కొన్ని నిమిషాల్లోనే కోలుకుని దాదాపు క్రితం స్థాయి వద్దే కొనసాగింది. రోజంతా ఇదే స్థాయిలో ఉన్న నిఫ్టి మిడ్‌ సెషన్‌ తరవాత 10,801కి చేరినా.. తరవాత వచ్చిన అమ్మకాల ఒత్తిడితో 10,791 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి రెండు పాయింట్లు లాభపడినా సెన్సెక్స్‌ 27 పాయింట్లు క్షీణించింది. మార్కెట్‌ స్థిరంగా ఉన్నా.. అనేక మిడ్‌ క్యాప్‌ షేర్లు లాభాలు గడించాయి. నిఫ్టిలో కూడా 17 షేర్లు నష్టాలతో క్లోజ్‌ కాగా.. 33 షేర్లు లాభాలతో ముగిశాయి.

లాభాలతో ముగిసిన నిఫ్టి షేర్లలో ఐఓసీ, హచ్‌పీసీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బీపీసీఎల్‌, వేదాంత ఉన్నాయి. ఇక నష్టాలతో ముగిసిన నిఫ్టి షేర్లలో కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, గెయిల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ ఉన్నాయి. టేకోవర్‌ వదంతులు రావడంతో సుజ్లాన్‌ కంపెనీ షేర్‌ ఇవాళ 26 శాతం పెరిగి రూ. 5.60 వద్ద ముగిసింది.