లాభాలతో ముగిసిన నిఫ్టి

లాభాలతో ముగిసిన నిఫ్టి

ఏకంగా వంద పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టి తరవాత క్రితం స్థాయి వద్దకు పడిపోయింది. మిడ్‌ సెషన్‌లో కోలుకున్నా.. క్రమంగా క్షీణించింది. కాని చివరి అరగంటలో వచ్చిన షార్ట్‌ కవరింగ్‌తో నిఫ్టి 35 పాయింట్ల లాభంతో 10,462 వద్ద ముగిసింది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడయ్యాయి. రూపాయి కూడా 61 పైసలు బలపడటంతో.. డాలర్‌తో రూపాయి విలువ 69 దిగువకు వచ్చేసింది. దీంతో ముడిచమురు ధరలు బాగా తగ్గాయి. మార్కెట్‌ మాత్రం పడుతూ వచ్చింది. మిడ్‌ సెషన్‌ తరవాత యూరో మార్కెట్లు ప్రారంభమైనా.. చాలా డల్‌గా ఉంది. పెద్దగా మార్పులు లేవు. ఐటీ, ఆటో షేర్ల సూచీలు ఒక శాతంపైగా నష్టపోయాయి. రియల్‌ ఎస్టేట్‌ సూచీ 3 శాతం పెరగడం విశేషం. ఎంబసీ ఆర్‌ఈఐటీ కంపెనీ పబ్లిక్‌ ఆఫర్‌కు రావడంతో రియాల్టి షేర్లకు కళ వచ్చింది.

నిఫ్టి ప్రధాన షేర్లలో ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ ఉన్నాయి. ఇక నష్టోపోయిన నిఫ్టి షేర్లలో మారుతీ, హీరో మోటోకార్ప్‌, విప్రో, భారతీ ఎయిర్‌టెల్‌, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు రెండు శాతంపైగా నష్టపోయాయి. ఇతర షేర్లలో జస్ట్‌ డయల్‌ 9 శాతం పెరగ్గా, ఆర్‌ కామ్‌ 9 శాతం క్షీణించింది.