భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

దాదాపు అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి రావడంతో నిఫ్టి భారీ నష్టాలతో ముగిసింది. ఒక్క ఐటీ, రియాల్టి మినహా దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. క్రితం ముగింపుతో పోలిస్తే రూపాయి ఇవాళ భారీగా నష్టపోయింది. ఫార్వర్డ్‌ మార్కెట్‌లో 72.77దాకా పడింది. పైగా చైనా వస్తువులపై సుమారు 200 బిలియన్ డాలర్ల వస్తువులపై సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పడంతో ఆసియా మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. దాదాపు అన్ని సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. యూరో సూచీలు మాత్రం స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి.

మిడ్ సెషన్ తరవాత కూడా మన మార్కెట్లు కోలుకోలేకపోయాయి. క్రితం ముగింపుతో పోలిస్తే నిప్టి 137 పాయింట్ల నష్టంతో 11,377 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టిలో 50 షేర్లలో 36 నష్టాలతో ముగిశాయి. ఇథనాల్ ధరలు పెంచడంతో గత మూడు రోజుల నుంచి చక్కెర షేర్లు భారీ లాభాలతో ముగిశాయి. లాభాలతో ముగిసిన నిఫ్టి షేర్లలో బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, టెక్‌ మహీంద్రా, ఐఓసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు ఉన్నాయి. ఇక నష్టాలతో ముగిసిన నిఫ్టి షేర్లలో ఇన్‌ఫ్రాటెల్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్, ఏషియన్ పెయింట్స్ ఉన్నాయి. చక్కెర షేర్లలో బజాజ్‌ హిందుస్థాన్‌, బలరాం పూర్‌ చిని, రేణుకా సుగర్స్ భారీ లాభాలతో ముగిశాయి. అలాగే సుజ్లాన్‌ 9 శాతం, ఆర్ కామ్ 5శాతం లాభంతో ముగిశాయి.