భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

బుల్లెట్‌ ట్రైన్‌లా రోజూ పరుగులు తీసిన నిఫ్టి ఇవాళ కూడా పెరిగినా.. చివర్లో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో నిఫ్టి 84 పాయింట్లకే పరిమితమైంది. ఇవాళ ఉదయం క్రితం ముగింపుతో పోలిస్తే 30 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టి తరవాత అనూహ్య స్థాయిలో పెరిగింది. రెండు సెషన్స్‌ నుంచి మార్కెట్‌కు అధిక స్థాయిలో అమ్మకాల ఒత్తిడి వస్తుందని అనుకుంటున్నా.. నిఫ్టి మాత్రం రోజుకో కొత్త స్థాయికి చేరింది. ఇవాళ ఒకదశలో 11,487 స్థాయికి చేరింది. ముఖ్యంగా బ్యాంకు షేర్ల అండతో నిఫ్టి ఆకర్షణీయ లాభాలు గడించింది. చివరి అరగంటలో వచ్చిన లాభాల స్వీకరణ తరవాత నిఫ్టి 11,426 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ కూడా 38,000 పైన 38,024 వద్ద ముగిసింది.

నిఫ్టి షేర్లలో కొటక్‌ బ్యాంక్‌ ఇవాళ కూడా పెరిగి, నాలుగు శాతంపైగా లాభపడి రూ. 1328 వద్ద ముగిసింది. ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌ షేర్లు మూడు శాతం పెరగ్గా.. పవర్‌ గ్రిడ్‌, విప్రో కూడా ఇదే స్థాయి లాభాలతో ముగిశాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో టాప్‌ లూజర్‌గా హిందుస్థాన్‌ లీవర్‌ నిలిచింది. ఎస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు1 శాతంపైగా నష్టంతో ముగిశాయి. ఇక బీఎస్‌ఈలో టాప్‌ గెయినర్స్‌లో అదానీ ట్రాన్స్‌ మిషన్‌, జన్సార్‌ టెక్నాలజీ, డీబీఎల్‌ ఉన్నాయి. ఇవన్నీ 9 శాతంపైన పెరిగాయి.  ఇక నష్టపోయిన వాటిల్లో స్టెర్‌లైట్‌ పది శాతంపైగా నష్టపోయింది.