నష్టాలతో ముగిసిన నిఫ్టి

నష్టాలతో ముగిసిన నిఫ్టి

మార్చి డెరివేటివ్స్‌ గడువు రేపటితో ముగియనుండటంతో నిఫ్టి తీవ్ర ఒడుదుడుకుల మధ్య ట్రేడవుతోంది. ఉదయం దాదాపు 45 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైన నిఫ్టి తరవాత 11,546కి చేరినా.. అధిక స్థాయిలో వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. అక్కడి నుంచి దాదాపు 100 పాయింట్లు క్షీణించింది. నిఫ్టి క్రితం ముగింపుతో పోలిస్తే 38 పాయింట్ల నష్టంతో 11,445 వద్ద ముగిసింది. ఉదయం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. జపాన్‌ నిక్కీ మినహా మిగిలిన సూచీలన్నీ నష్టాల్లో ముగిశాయి. మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు కూడా మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. కానీ.. కొంతసేపటికే అన్ని సూచీలు రెడ్‌లోకి వెళ్ళాయి. ఈ నేపథ్యంలో మన మార్కెట్లను బ్యాంకులు కాపాడాయి.

ఇవాళ ప్రభుత్వ బ్యాంకుల సూచీ 1.59 శాతం పెరగ్గా.. ప్రైవేట్‌ బ్యాంకుల సూచీ కూడా 0.5 శాతం పెరిగింది. ఫార్మా, ఆటో దెబ్బతీశాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో ఎస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక టాప్ లూజర్స్‌గా నిలిచిన వాటిలో హెచ్‌పీసీఎల్‌, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్‌, భారతీ ఎయిర్‌ టెల్‌, ఐషర్‌ మోటార్స్‌ ఉన్నాయి. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో మాగ్మా 13 శాతం పెరగ్గా.. ఐనాక్స్‌ లీజర్‌ 9 శాతం, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ 8 శాతంపైగా పెరిగాయి. జీఐసీ హౌసింగ్‌, అవంత కూడా 7 శాతంపైగా పెరిగాయి. ఇక నష్టాల్లో ఉన్న సెన్సెక్స్‌ షేర్లలో ఆర్‌ కామ్‌, జూబ్లియంట్‌, టాటా స్టీల్‌ (పీపీ), ఓరియంట్‌ సిమెంట్‌, క్వెస్‌ టెక్నాలజీ ఉన్నాయి.