మళ్ళీ భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

మళ్ళీ భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధంతో పాటు రూపాయి బలహీనత స్టాక్ మార్కెట్లను కుంగతీసింది. పైగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో దేనా బ్యాంక్‌, విజయ బ్యాంక్‌ విలీన ప్రతిపాదనకు మార్కెట్‌ ప్రతికూలంగా స్పందించింది. నష్టాల బ్యాంకులను పటిష్ఠమైన బ్యాంకుల్లో చేర్చి.. మొత్తం బ్యాంకునే దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. పటిష్టమైన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 17 శాతం నష్టంతో క్లోజ్‌ కాగా.. విజయా బ్యాంక్‌ కూడా 7 శాతం క్షీణించింది. నష్టాల్లో ఉన్న దేనా బ్యాంక్ 20 శాతం లాభంతో క్లోజైంది. ప్రభుత్వ చర్య కారణంగా బ్యాంకింగ్ ఇండెక్స్‌ ఏకంగా ఒకటిన్నర శాతం క్షీణించింది. ఇందులో పీఎస్‌యూ బ్యాంక్ షేర్ల సూచీ ఏకంగా 5 శాతం తగ్గింది. ఎస్‌బీఐ వంటి షేర్లు కూడా భారీ నష్టాలతో ముగిశాయి. ఒక్క ఎఫ్‌ఎంసీజీ కౌంటర్‌ తప్ప మిగిలిన అన్ని సూచీలు కనీసం ఒక శాతంపైగా క్షీణించాయి. రియాల్టి సూచీ మూడు శాతం తగ్గింది. నిఫ్టి ప్రధాన షేర్లలో హిందుస్థాన్‌ లీవర్, ఎస్‌ బ్యాంక్, ఓఎన్‌జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఐటీసీ ఉన్నాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో ఎస్‌బీఐ అగ్రస్థానంలో ఉంది. ఇండియా బుల్స్ హౌసింగ్‌, టాటా మోటార్స్, హెచ్‌పీసీఎల్‌, బజాజ్‌ ఆటో షేర్లు తరవాతి స్థానాల్లో ఉన్నాయి.