న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

బ‌డ్జెట్ ప్ర‌భావం మార్కెట్ పై ఏమాత్రం క‌న్పించ‌డం లేదు. నిఫ్టి ఇవాళ న‌ష్టాల‌తో ప్రారంభ‌మైంది. గ‌త‌ శుక్ర‌వారం అమెరికా మార్కెట్లు నిస్తేజంగా ముగిసినా.. జాబ్ డేటా పాజిటివ్‌గా ఉంది. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. లాభన‌ష్టాల్లో పెద్ద తేడా లేదు. మ‌న మార్కెట్ల‌లో మాత్రం ప‌రిస్థితి చాలా భిన్నంగా ఉంది. డాల‌ర్‌, క్రూడ్ స్థిరంగా ఉన్నా.. మ‌న ఫారెక్స్ మార్కెట్ల‌లో డాల‌ర్‌తో రూపాయి ఏకంగా 40 పైస‌లు క్షీణించింది. దీంతో నిఫ్టిపై ఒత్తిడి పెరిగింది. ప్ర‌స్తుతం నిఫ్టి 30 పాయింట్ల న‌ష్టంతో 10,863 పాయింట్ల వ‌ద్ద ట్రేడ‌వుతోంది. ఆరంభంలోనే జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఏకంగా నాలుగు శాతంపైన క్షీణించింది. ఒక‌ద‌శ‌లో 329కి ప‌డిపోయిన షేర్.. ఇపుడు రూ. 340 ప్రాంతంలో ట్రేడ‌వుతోంది. వాటా అమ్మేందుకు ప్రమోట‌ర్లు సిద్ధ‌మౌతుండ‌గా, సెబీ స్టాక్ ఎక్స్ఛేంజీలు రంగంలోకి దిగాయి. కంపెనీ నుంచి డేటా కోరుతున్నాయి. దీంతో సెంటిమెంట్ దెబ్బ‌తింది.

నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో టైటాన్ టాప్ గెయిన‌ర్‌గా నిలిచింది. త‌ర‌వాతి స్థానాల్లో ఓఎన్‌జీసీ, డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌, రిల‌య‌న్స్‌, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఉన్నాయి. ఇక న‌ష్ట‌పోయిన నిఫ్టి షేర్ల‌లో ఎస్ బ్యాంక్‌, జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, టాటా స్టీల్‌, హెచ్‌పీసీఎల్‌, భార‌తీ ఎయిర్ టెల్ ఉన్నాయి. ముకేష్ అంబానీకి చెందిన ఆర్ కామ్ షేర్ ఏకంగా 35 శాతం క్షీణించింది.