11,000 ఎగువ‌న ప్రారంభ‌మైన నిఫ్టి

11,000 ఎగువ‌న ప్రారంభ‌మైన నిఫ్టి

స్టాక్ మార్కెట్‌లో ర్యాలీ ఇవాళ కూడా కొన‌సాగింది. అంత‌ర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా.. మ‌న మార్కెట్ల‌లో మాత్రం కొనుగోళ్ళు కొన‌సాగుతున్నాయి. నిఫ్టి ఓపెనింగ్‌లో 11వేల మార్కును దాటింది. 11,024 వ‌ద్ద ప్రారంభ‌మైన నిఫ్టి.. ప్ర‌స్తుతం 46 పాయింట్ల లాభంతో 11,034 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. రాత్రి అమెరికా మార్కె్ట్లు నిస్తేజంగా ముగిశాయి. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు రాత్రి కూడా క్షీణించాయి. డాల‌ర్ స్త‌బ్దుగా ఉండ‌టంతో.. నిన్న దాదాపు అర్ధ‌రూపాయి బ‌ల‌ప‌డిన రూపాయి ఇవాళ కూడా మ‌రో ప‌ది పైస‌లు బ‌ల‌ప‌డింది. నిన్న భారీగా పెరిగిన ఆటో షేర్ల‌లో కాస్త అమ్మ‌కాల ఒత్తిడి కొన‌సాగుతున్నా.. ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో జోష్ కొన‌సాగుతోంది. పెద్ద బ్యాంకుల‌కు బ‌ద‌లు.. మ‌ధ్య‌, చిన్న త‌రహా బ్యాంకుల్లో భారీ ఎత్తున కొనుగోళ్ళు కొన‌సాగుతున్నాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. దీంతో ఈ ర్యాలీ మిడ్ సెష‌న్ త‌ర‌వాత కూడా కొన‌సాగుతుందా లేదా అన్న‌ది యూరో మార్కెట్ల ఓపెనింగ్ త‌ర‌వాత తెలుస్తుంది.

నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో విప్రో, ఇన్‌ఫ్రాటెల్‌, ఇండియా బుల్స్ హౌసింగ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, వేదాంత టాప్ గెయిన‌ర్స్‌గా నిలిచాయి. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో టాప్ టూజ‌ర్స్‌లో టాటా మోటార్స్‌, స‌న్ ఫార్మా, హీరో మోటోకార్ప్‌, బ‌జాజ్ ఆటో, కోల్ ఇండియా ఉన్నాయి.  ఇత‌ర షేర్ల‌లో దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ షేరు 16 శాతంపైగా లాభ‌ప‌డింది.