లాభాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్‌

లాభాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్‌

అంత‌ర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండ‌టంతో మ‌న మార్కెట్లు లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. గ‌త కొన్నిరోజులుగా భారీగా అమ్మ‌కాల ఒత్తిడికిలోనైనా ఎన్‌బీఎఫ్‌సీ షేర్ల‌కు ఇవాళ మ‌ద్ద‌తు అందింది. ఇవాళ, రేపు అమెరికా సెంట్ర‌ల్ బ్యాంక్ ఫెడ‌రల్ రిజ‌ర్వ్ వ‌డ్డీ రేట్ల‌ను స‌మీక్షించే అవ‌కాశ‌మున్నందున డాల‌ర్ నిల‌క‌గా ఉంది. ముడి చ‌మురు ధ‌ర‌లు నాలుగేళ్ళ గ‌రిష్ఠ స్థాయి వ‌ద్ద స్థిరంగా ట్రేడ‌వుతున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిసినా నామ‌మాత్ర‌మే. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు మాత్రం భారీ లాభాల‌తో ట్రేడ‌వుతున్నాయి.   అమెరికా వడ్డీ రేట్లు పెంచినా చైనా మాత్రం పెంచ‌క‌పోవ‌చ్చ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో జపాన్‌, హాంగ్‌సెంగ్ కూడా గ్రీన్‌లో ఉన్నాయి. 

మ‌న మార్కెట్లు లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. నిఫ్టి ప్ర‌స్తుతం 16 పాయింట్ల లాభంతో 11084 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నా.. అవి నామమాత్రంగానే ఉన్నాయ‌. రియాల్టి అమ్మకాలు కూడా సాగుతున్నాయి. ఇక నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌, ఎస్ బ్యాంక్‌, లుపిన్‌, ఐష‌ర్ మోటార్స్, హిందాల్కో ముందున్నాయి. ఇక న‌ష్టాల‌తో ట్రేడ‌వుతున్న నిఫ్టి షేర్ల‌లో విప్రో, హెచ్‌సీఎల్ టెక్‌, ఓఎన్‌జీసీ, ఐటీసీ, ప‌వ‌ర్ గ్రిడ్ ఉన్నాయి. డీహెచ్ఎఫ్ఎల్ 3 శాతం లాభంతో ట్రేడ‌వుతోంది.