స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

మార్చి డెరివేటిక్స్ కాంట్రాక్ట్ ముగింపు ఎల్లుండి కావ‌డంతో మార్కెట్ నిల‌క‌డ‌గా ఉంటోంది. అంత‌ర్జాతీయంగా కూడా మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. భారీగా న‌ష్ట‌పోయిన అమెరికా మార్కెట్లు నిన్న రాత్రి తేరుకుని స్థిరంగా ముగిశాయి. అమెరికా ఆర్థిక మాంద్యం ఛాయ‌లు క‌న్పిస్తున్న‌ట్లు వాణిజ్య డేటా చెబుతోంది. ముఖ్యంగా ప్ర‌భుత్వ బాండ్ల‌పై ఈల్డ్స్ బాగా త‌గ్గ‌డం మార్కెట్‌ను ఆందోళ‌న క‌ల్గిస్తోంది. దీంతో డాల‌ర్ కూడా స్థిరంగా ఉంది. ముడి చ‌మురు ధ‌ర‌ల్లో ఎక్క‌డా బ‌ల‌హీనత క‌న్పించ‌డం లేదు. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు కూడా మిశ్రమంగా ఉన్నాయి. నిన్న మూడు శాతం పైగా న‌ష్ట‌పోయిన నిఫ్టి ఇవాళ రెండు శాతం లాభంలో ఉంది. హాంగ్‌సెంగ్ లాభాలు నామ‌మాత్రంగా ఉండ‌గా.. చైనా మార్కెట్లు మాత్రం న‌ష్టాల్లో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌న మార్కెట్లు స్థిరంగా ప్రారంభ‌మ‌య్యాయి. నిఫ్టి 20 పాయింట్ల లాభంతో 11,375 వ‌ద్ద  ట్రేడ‌వుతోంది.

గ‌త కొన్ని రోజులుగా ప్ర‌భుత్వ రంగ కంపెనీలే మార్కెట్‌ను నిల‌బెడుతున్నాయి. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఇవాళ టాప్ గెయినర్స్‌లో ఓఎన్‌జీసీ, ఐఓసీ, జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ షేర్లు ఉన్నాయి. న‌ష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్ల‌లో ఇన్ఫోసిస్‌, టెక్ మ‌హీంద్రా, టీసీఎస్‌, యూపీఎల్‌, ప‌వ‌ర్ గ్రిడ్ షేర్లు ఉన్నాయి. జెట్ ఎయిర్‌వేస్ ఇవాళ మ‌రో 8 శాతం పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ ప్ర‌ధాన షేర్ల‌లో లాభాలు పొందిన షేర్ల‌లో జెట్ ఎయిర్ వేస్‌, డీబీ లిమిటెడ్, టాటా స్టీల్ (పీపీ), టేక్ సొల్యూష‌న్స్‌, ఇండియా బుల్స్ రియ‌ల్ ఎస్టేట్ ఉన్నాయి. ఇక న‌ష్ట‌పోయిన సెన్సెక్స్ షేర్ల‌లో ఆర్ కామ్‌, స్పైస్ జెట్‌, మాగ్మా, ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్‌, జూబిలియంట్ ఫుడ్ ఉన్నాయి.