భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

ఆర్‌బీఐ పరపతి విధానానికి స్టాక్‌ మార్కెట్‌ సానుకూలంగా స్పందించింది. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్‌ మధ్యాహ్నం కాస్త నీరసించినా... ఆర్‌బీఐ పరపతి విధాన ప్రకటన తరవాత ఊపందుకుంది. నిఫ్టి క్రితం ముగింపుతో పోలిస్తే 91 పాయింట్లు లాభపడి 10,684 వద్ద ముగిసింది. ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంకులు, మెటల్‌, ఫార్మా కౌంటర్లు రెండు శాతం దాకా లాభపడ్డాయి. ఫైనాన్స్‌ కంపెనీలు కూడా పెరిగాయి. ఆటోమొబైల్‌ కంపెనీల షేర్లకు గట్టి మద్దతు లభించింది. ఇవాళ అత్యధిక లాభాలతో ముగిసిన నిఫ్టి షేర్లలో భారతీ ఎయిర్‌టెల్‌, టైటాన్‌ నాలుగున్నర శాతం లాభంతో క్లోజ్‌ కాగా టాటా మోటార్స్‌ కూడా నాలుగు శాతం లాభపడింది.సన్‌ ఫార్మా, బజాజ్‌ ఫైనాన్స్‌ కూడా మూడు శాతం పైగా లాభపడ్డాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో హెచ్‌పీసీఎల్‌ ఉంది. ఈ షేర్‌ ఒక శాతం నష్టపోయింది. టెక్‌ మహీంద్రా, సిప్లా, గెయిల్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు నామ మాత్రపు నష్టాలతో ముగిశాయి. ఇక బీఎస్‌ఇలో అవంతీ ఫీడ్స్‌ రికార్డు స్థాయిలో ఏకంగా 20 శాతం పెరగ్గా, ఆర్‌ కామ్‌ పది శాతం లాభపడింది.